సుప్రీం కోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట..! 11 h ago
TG: ఫార్ములా ఈ-కార్ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు చుక్కెదురైన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్‌గా మెన్షన్ చేశారు. న్యాయస్థానం స్పందించి తక్షణ విచారణ కుదదరని చెప్పింది. ఈ నెల 15న విచారిస్తామని ప్రకటించింది.